Batukammanews
Newspaper Banner
Date of Publish : 14 November 2025, 4:40 pm Posted by : ramakrishna

నగరంలో బీజేపీ విజయోత్సవ సంబరాలు

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : బీహార్ రాష్ట్రంలో ఎన్డీయే కూటమి ఘనవిజయం సాధించిన నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు దినేష్ కులచారి అధ్యక్షతన విజయోత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమనికి ముఖ్య అతిథులుగా నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ హాజరై కార్యకర్తలను ఉత్సాహపరిచారు. జిల్లా పార్టీ కార్యాలయం నుండి ప్రారంభమైన పాదయాత్ర  ప్రధాన రహదారి గుండా సాగి  అనంతరం నిఖీల్ సాయి చౌరస్తా వద్ద ఘనంగా సంబరాలు నిర్వహించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే శ్రీ ధన్‌పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ.. ఈ సంబరం కేవలం బీహార్ రాష్ట్ర విజయానికి మాత్రమే కాదు దేశాన్ని అభివృద్ధి దిశగా తీసుకువెళ్తున్న శక్తుల విజయానికి సూచిక అని అన్నారు. బీహార్ ప్రజలు ఇచ్చిన తీర్పు చాలా స్పష్టమైన సందేశం చెబుతోందన్నారు. ‘అభివృద్ధి గెలుస్తుంది… సేవ గెలుస్తుంది… సత్యం గెలుస్తుంది.’ ఈ తీర్పు దేశ ప్రజల మనసులో ఎన్డిఏ  ప్రభుత్వంపై ఉన్న విశ్వాసానికి ప్రతిబింబం అని తెలిపారు. బీజేపీ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుందన్నారు. ఈ కార్యక్రమం లో బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి నాగోల్ల లక్ష్మీనారాయణ, బిజెపి నాయకులు న్యాలం రాజు, తాజా మాజీ కార్పొరేటర్ మాస్టర్ శంకర్, ఎర్రం సుధీర్, మండల అధ్యక్షులు ఆనంద్ రావు, తారక వేణు, బిజెపి నాయకులు ఇల్లందుల ప్రభాకర్, బీజేపీ జిల్లా మీడియా కన్వీనర్ పుట్ట వీరేందర్, ఇప్పకాయల కిషోర్, మఠం పవన్, భూపతి చిరంజీవి, దీపక్, నరేష్, శిలా శ్రీనివాస్, భూమేష్, కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

BJP victory celebrations in the city