బోధన్ లో బీజేపీ విజయోత్సవ సంబరాలు
బతుకమ్మ, బోధన్: బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో 244 స్థానాల్లో 200కు పైగా స్థానాలు కైవసం చేసుకుని ఎన్డీఏ కూటమి ఘనవిజయం సాధించడంతో బోధన్ పట్టణంలో బీజేపీ కార్యకర్తలు ఆనందోత్సాహాలతో సంబరాలు జరుపుకున్నారు. పట్టణ బీజేపీ అధ్యక్షుడు పసుపులేటి గోపి కిషన్ ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తాలో శుక్రవారం కార్యకర్తలు భారీ సంఖ్యలో హాజరై టపాసులు కాల్చి పరస్పరం మిఠాయిలు పంచుకున్నారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షుడు పసుపులేటి గోపి కిషన్ మాట్లాడుతూ దేశ అభివృద్ధి, సంక్షేమం, భద్రత కోసం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నిరంతరం...