Batukammanews
Newspaper Banner
Date of Publish : 14 November 2025, 6:29 pm Posted by : ramakrishna

బోధన్ లో బీజేపీ విజయోత్సవ సంబరాలు

బతుకమ్మ, బోధన్: బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో 244 స్థానాల్లో 200కు పైగా స్థానాలు కైవసం చేసుకుని ఎన్డీఏ కూటమి ఘనవిజయం సాధించడంతో బోధన్ పట్టణంలో బీజేపీ కార్యకర్తలు ఆనందోత్సాహాలతో సంబరాలు జరుపుకున్నారు. పట్టణ బీజేపీ అధ్యక్షుడు పసుపులేటి గోపి కిషన్ ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తాలో శుక్రవారం కార్యకర్తలు భారీ సంఖ్యలో హాజరై టపాసులు కాల్చి పరస్పరం మిఠాయిలు పంచుకున్నారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షుడు పసుపులేటి గోపి కిషన్ మాట్లాడుతూ దేశ అభివృద్ధి, సంక్షేమం, భద్రత కోసం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నిరంతరం చేస్తున్న కృషిని ప్రజలు సమర్థించారని అన్నారు. ఆ విశ్వాసానికి ఫలితంగానే బీహార్ ప్రజలు భారీ మెజారిటీతో తీర్పు ఇచ్చారని పేర్కొన్నారు. బీహార్ ప్రజల మద్దతుకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో పట్టణ ప్రధాన కార్యదర్శి పవన్ కుమార్, కోశాధికారి పప్పుల వేణు, కార్యదర్శి సప్పిల్, బీజేవైఎం పట్టణ అధ్యక్షుడు ఎనుగంటి గౌతమ్ గౌడ్, అనిల్, ఫణి, ప్రీతం గౌడ్, బిల్లా విజయ్, సాగర్, శ్రీకాంత్, రాజు, పడాల శ్రీనివాస్, కుమారు, లోకేష్, ధర్మేందర్ సింగ్, పంజాబ్ సింగ్, పవన్ కళ్యాణ్, భాస్కర్, నవీన్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.

BJP victory celebrations in Bodhan