నిరుద్యోగుల ఆందోళనకు బీజేపీ మద్దతు
. బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మల్కాజ్ గిరి ఎంపీ ఈటెల రాజేందర్ నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: రాష్ర్ట ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో 29న సడలించాలని నిరుద్యోగులు చేస్తున్న ఆందోళనకు బీజేపీ మద్దతు ఇస్తుందని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మల్కాజ్ గిరి ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. నగరంలోని పార్టీ కార్యాలయంలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం ఒకసారి గుర్తు చేసుకోవాలన్నారు. తమ పరిస్థితి పెనం నుంచి పొయ్యిలో పడినట్లైందని ప్రజలు...