Batukammanews
Newspaper Banner
Date of Publish : 24 April 2026, 9:19 pm Posted by : ramakrishna

ఆర్టీసీ కార్మికులకు బీజేపీ మద్దతు

 

కామారెడ్డి, బతుకమ్మ :

 

తమ న్యాయమైన డిమాండ్ లను వెంటనే నెరవేర్చాలని సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులకు బీజేపీ నాయకులు మద్దతు తెలిపారు. కామారెడ్డి శాసన సభ్యులు కాటిపల్లి వెంకట రమణ రెడ్డి ఆదేశాల మేరకు బిజెపి పట్టణ శాఖ ఆధ్వర్యంలో కొత్త బస్టాండ్ వద్ద రాస్తారోకో కార్యక్రమం చేస్తున్న ఆర్టీసీ కార్మికులకు శుక్రవారం మద్దతు తెలిపారు. తమ న్యాయమైన డిమాండ్ లు నెరవేర్చే వరకు ఆర్టీసీ కార్మికులకు బిజెపి పార్టీ అండగా ఉంటుందని కేవీఆర్ భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ కార్యకర్తలు, ఆర్టీసీ కార్మికులు పాల్గొన్నారు.