- ఆర్ముర్ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల ఇంచార్జీ
ఆర్మూర్, బతుకమ్మ : హైద్రాబాద్ చైతన్యపురి కార్పొరేటర్ రంగా నర్సింహా గుప్తా పట్టభద్రుల ఇంటికి వెళ్లి కలసి బీజేపీ బలపర్చిన ఎమ్మెల్సీ అభ్యర్థులు అంజి రెడ్డి, మల్కకొమరయ్య ని గెలిపించాలని కోరారు. బీజేపీ బలపర్చిన అభ్యర్థులు గెలిపిస్తే తెలంగాణ రాష్ట్రం లో మరింత అభిరుద్దికి సాధ్యం అవుతుందని తెలిపారు. మోడీ నాయకత్వం లో భారత దేశం అగ్రగామిగా వెలుగొందుతుందని అన్నారు. నీతి వంతమైన పాలన కొనసాగుతుందని అన్నారు. పెర్కిట్, కమలనెహ్రు కలోని, ఆలూరు రోడ్ లలో పర్యటించి పట్టభద్రుల ఇంటింటికి తిరిగి అభ్యర్థించారు. ఈ ప్రచారం లో పాలేపు రాజు, కలిగొట గంగాధర్, నూతుల శ్రీనివాస్ రెడ్డి, నవీన్ యాదవ్, రుద్రరపు శంకర్, నరేందర్ రెడ్డి మాజీ కౌన్సిలర్ సాయి లు పాల్గొన్నారు.