రైతులను పరామర్శించిన బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వడ్డీ మోహన్ రెడ్డి
బతుకమ్మ, బోధన్ : బోధన్ నియోజకవర్గం సాలూరు మండలంలోని హుంస, ఖాజాపూర్, మందర్న గ్రామాల్లో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డీ మోహన్ రెడ్డి పర్యటించారు. గత నాలుగు రోజులుగా కురుస్తున్న అకాల వర్షాల కారణంగా నష్టపోయిన రైతులను ఆయన పరామర్శించారు. ఖాజాపూర్ గ్రామంలో ట్రాక్టర్‌పై వెళ్లి పంట పొలాలను సందర్శించి రైతుల సమస్యలను స్వయంగా తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే నష్టపోయిన ప్రతి రైతుకు నష్టపరిహారం అందించేలా అధికార యంత్రాంగాన్ని ఆదేశించాలన్నారు. రైతుల కష్టసుఖాల్లో ప్రభుత్వం...