Batukammanews
Newspaper Banner
Date of Publish : 14 December 2024, 7:22 pm Posted by : ramakrishna

నూతన బూత్ కమిటీలు ఏర్పాటు చేయాలి

  • ఒక బూత్ లో 100 ప్రాథమిక సభ్యత్వాలు అయితేనే బూత్ కమిటీ ఎన్నిక జరగాలి
  • బూత్ కమిటీల ఎన్నిక అనంతరం అందరి సమన్వయంతో మండల కమిటీ ఏర్పాటు చేయాలి
  • బీజేపీ రాష్ట్ర సంఘటన కార్యదర్శి చంద్రశేఖర్

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :  జిల్లాలోని అన్ని మండలాల్లో నూతనంగా బూత్ కమిటీలను ఏర్పాటు చేయాలని బీజేపీ రాష్ట్ర సంఘటన కార్యదర్శి చంద్రశేఖర్ అన్నారు. బీజేపీ సభ్యత్వ నమోదు, క్రియాశీల సభ్యత్వ నమోదు, సంస్థాగత ఎన్నికలు, బూత్ కమిటీలు, మండల కమిటీ ల ఎన్నిక ల విషయమై సంఘటన పర్వ్ కార్యక్రమంలో భాగంగా శనివారం బీజేపీ జిల్లా కార్యాలయంలో రాష్ట్ర, జిల్లా నాయకులు, అసెంబ్లీ కన్వీనర్ లు, మోర్చ అధ్యక్షుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన బీజేపీ రాష్ట్ర సంఘటన కార్యదర్శి చంద్రశేఖర్ మాట్లాడుతూ జిల్లా లోని అన్ని మండలాల్లో అర్హత సాధించిన బూత్ లలో  నూతనంగా బూత్ కమిటీలు ఏర్పాటు చేయాలని అన్నారు. ఒక బూత్ లో 100 ప్రాథమిక సభ్యత్వాలు అయితేనే బూత్ కమిటీ ఎన్నిక జరగాలని అన్నారు. బూత్ కమిటీల ఎన్నిక అనంతరం అందరి సమన్వయంతో మండల కమిటీ ఏర్పాటు చేయాలని అన్నారు. బూత్ కమిటీలె పార్టీ కి పునాదులు అని బూత్ స్థాయిలో పార్టీ బలంగా ఉంటేనే అన్ని స్థాయిల్లో ఎన్నికలు గెలవగలము అని మహారాష్ట్ర లో పార్టీ అదే విధంగా గెలిచిందని అన్నారు. ఇప్పటి నుండే పార్టీని పటిష్ఠం చేసి రాబోయే అసెంబ్లీ ఎన్నికల నాటికి అధికారంలోకి రావాలని అన్నారు.

BJP State Event Secretary Chandrasekhar