Batukammanews
Newspaper Banner
Date of Publish : 05 July 2025, 12:00 pm Posted by : ramakrishna

తెలంగాణ ప్రజలకు అండగా బీజేపీ

హైదరాబాద్​,బతుకమ్మ :  బీజేపీ రాష్ట్ర  అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించనున్న రాంచందర్ రావు శనివారం  ఉదయం హైదరాబాద్ లోని చార్మినార్ వద్ద గల భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. పార్టీ నాకు గొప్ప అవకాశం ఇచ్చిందన్నారు. ఇవాళ అధ్యక్షుడిగా ఛార్జ్ తీసుకోబోతున్నాని అన్నారు. కిషన్ రెడ్డి నేతృత్వం అనేక సంవత్సరాలుగా రాష్ట్ర బీజేపీకి మార్గదర్శకమైందన్నారు.  కిషన్ రెడ్డి నుంచి అధ్యక్షుడిగా ఛార్జ్ తీసుకుంటున్నందుకు గొప్పగా… సంతోషంగా ఉందన్నారు. తెలంగాణ ప్రజలకు బీజేపీ అండగా నిలబడుతుందన్నారు. పార్టీని నమ్ముకున్న వారిని బీజేపీ ఎప్పుడు మోసం చేయదని.. అందుకు తానే ఉదహరణ అన్నారు. పార్టీ అభివృద్ధికి పని చేసిన అందరికీ అవకాశాలుంటాయన్నారు. విధానాలు, నిర్ణయాలు నచ్చక ఎవరు వీడినా పార్టీకి నష్టం లేదన్నారు. పార్టీ వ్యక్తుల కోసం పనిచేయదు.. ప్రజలు వ్యవస్థ కోసం పనిచేస్తుందని పేర్కొన్నారు.