- బిజెపి రాష్ట్ర కార్యవర్గనాయకులు మెడపాటి ప్రకాశ్ రెడ్డి
బోధన్, బతుకమ్మ : స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గనాయకులు మెడపాటి ప్రకాశ్ రెడ్డి పిలుపునిచ్చారు. బోధన్ పట్టణంలోని బిజెపి ఎంపీఆర్ కార్యాలయంలో సోమవారం బిజెపి రాష్ట్ర కార్యవర్గనాయకులు మెడపాటి ప్రకాశ్ రెడ్డి, నియోజకవర్గ ఇన్చార్జ్ వడ్డీ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో బిజెపి పార్టీ నాయకులతో, కార్యకర్తలతో ఆత్మీయ సమావేశాన్నినిర్వహించారు. ఎన్నికలవేళ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను మరచి ప్రజలను మోసం చేస్తున్న విషయాల గురించి గ్రామం నుండి పట్టణం వరకు గడపగడపకు ప్రచారం చేయాలని సూచించారు. పేదలకు ఉచిత రేషన్, ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇళ్ల నిర్మాణం చేపడుతున్న విషయం ప్రజలకు తెలియజేసి, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బిజెపి ని గెలిపిస్తే మరింత అభివృద్ధినీ సాధ్యమవుతుందని అన్నారు.