Batukammanews
Newspaper Banner
Date of Publish : 18 September 2025, 4:55 pm Posted by : ramakrishna

మోదీ జన్మదినం సందర్భంగా బిజెపి సేవా పక్షం కార్యక్రమం

బతుకమ్మ, బోధన్: ప్రధాని నరేంద్ర మోదీ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని తెలంగాణ బిజెపి పిలుపు మేరకు జరుగుతున్న “సేవ పక్షం” కార్యక్రమాల భాగంగా బోధన్ పట్టణ బిజెపి శాఖ ఆధ్వర్యంలో శక్కర్‌నగర్ హనుమాన్ వ్యాయామశాల పరిసర ప్రాంతంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అడ్లూరి శ్రీనివాస్, పట్టణ అధ్యక్షులు పసులోటి గోపీ కిషన్ మాట్లాడుతూ సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 2 వరకు రాష్ట్రవ్యాప్తంగా రక్తదాన శిబిరాలు, ఆరోగ్య శిబిరాలు, స్వచ్ఛ భారత్ వంటి సేవా కార్యక్రమాలు కొనసాగుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ మాసిని వినోద్ (చిన్న), మాజీ కౌన్సిలర్ గొడుగు ధర్మపురి, పట్టణ ప్రధాన కార్యదర్శి పవన్ కుమార్, సీనియర్ నాయకులు హన్మాండ్లు చారి, పెరుక వెంకటేష్, పట్టణ కార్యదర్శి శివరాజ్, స్వప్నిల్, కిషన్, పడాల శ్రీను, పుల్లెల్వార్డ్ రాజు, అనిల్, గుడుముల శ్రీకాంత్, ఈశ్వర్, శ్రీనివాస్, అశోక్, కుషులు తదితరులు పాల్గొన్నారు.

BJP Seva Paksham program on the occasion of Modi's birthday