Batukammanews
Newspaper Banner
Date of Publish : 27 October 2026, 1:22 pm Posted by : ramakrishna

ఆర్ వోబి నిధుల కోసం బీజేపీ బిక్షాటన

 

నిజామాబాద్ రూరల్, బతుకమ్మ :

 

మాదవనగర్ ఆర్వోబి కోసం రాష్ట్ర ప్రభుత్వం నిధుల విడుదల జాప్యం చేయడంతో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో బిక్షాటన నిర్వహించారు. మంగళవారం మాదవనగర్ ఆర్ వోబి వద్ద ఎంపీ ధర్మపురి అరవింద్, బీజేపీ శాసనసభపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యేధన్ పాల్ సూర్యనారాయణ, బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి, జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి స్రవంతిరెడ్డి, బీజేపీ కార్పొరేటర్లు నిరసన దీక్ష నిర్వహించారు.

BJP resorts to begging for ROB funds
 

ఈ సందర్భంగా బీజేపీ శాసనసభపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ఎంపీ ధర్మపురి అరవింద్ లు మాట్లాడుతూ ఈ మాధవ్ నగర్ గేటుతో నరకయాతన పడాల్సిన పరిస్థితి నెలకొంది.  నిత్యం ఈ రోడ్డు మీదుగా అన్ని రకాల వాహనాలు సుమారు 4 నుంచి 5 వేల వరకు రాకపోకలు కొనసాగిస్తాయన్నారు. అలాగే ప్రతిరోజు 24 గంటల్లో 58 రైళ్ల రాకపోకలు కొనసాగుతాయని పేర్కొన్నారు. దీంతో ప్రతిసారి  15 నుంచి 20 నిమిషాల వరకు గేటు పడటం,భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో ఇబ్బందులు తప్పడం లేదన్నారు. ప్రధానంగా ఈ సమస్యతో స్కూల్ పిల్లలు స్కూల్ కి లేట్… కూలీలు పనికి లేట్..రోగులు హాస్పిటల్ కి లేట్… ప్రభుత్వ ఉద్యోగులు ఉద్యోగానికి లేట్… చివరికి శవాలు కూడా స్మశానానికి లేట్ గా వెళ్లాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. ఆర్ వోబీ కొరకు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ని కలిసి కేంద్ర నిధులు మంజూరు చేయించారన్నారు. రైల్వే శాఖ తనవంతు పని పూర్తి చేసిందని,మరి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు.  మాధవ్ నగర్ ఆర్ఓబిపై ఆర్ అండ్ బీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డిని గత ఏడాది కలిస్తే వెంటనే పూర్తి చేయాలని అధికారులకు ఆదేశం ఇచ్చినట్లు గుర్తు చేశారు.కానీ ఇప్పటివరకు ఎందుకు పూర్తి కావడం లేదని ప్రశ్నించారు. నిధులు విడుదల చేసేంత వరకు దీక్ష కొనసాగిస్తామన్నారు.

BJP resorts to begging for ROB funds