ఎల్లారెడ్డిపేట, బతుకమ్మ : భారతీయ జనతా పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ బూత్ అధ్యక్షుల సమావేశానికి మండల బిజెపి అధ్యక్షులు రేపాక రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో బిజెపి శ్రేణులు భారీ సంఖ్యలో తరలి వెళ్లారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్ర రావు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ లు పాల్గొన్నారు. సమావేశానికి బిజెపి మండల, గ్రామస్థాయి, నాయకులు, కార్యకర్తలు తదితరులు తరలివెళ్లారు.