ధర్పల్లి, బతుకమ్మ : ధర్పల్లి మండలంలో శుక్రవారం కురిసిన ఆకాల వర్షాల కారణంగా హోన్నాజీపేట్, వాడి, గుడి తండాలో నోట్లోకి వచ్చిన వందల ఎకరాల వరి పంట నష్టం వాటిల్లింది. నష్టపోయిన వరి పంటలను బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారి శనివారం పరిశీలించారు. నష్టపోయిన రైతులను ఓదార్చి ఎకరానికి 30వేల రూపాయలు నష్టపరిహారాన్ని ప్రభుత్వం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.
