బిజెపి కార్యాలయాలు ముట్టడిస్తాం
ఆర్మూర్, బతుకమ్మ : కాంగ్రెస్ నేత ఎంపీ ప్రియాంక గాంధీ పై బిజెపి నేత మాజీ ఎంపీ రమేష్ బిదురి అభ్యంతకరమైన వ్యాఖ్య చేయడాన్ని నిజామాబాదు రూరల్ యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు సొప్పరి వినోద్ తీవ్రంగా ఖండించారు. ఇటువంటి మహిళా వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన రమేష్ పై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇటువంటి ప్రకటనలు చేస్తున్నందుకు బిజెపి బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని అన్నారు. రమేష్ చేసిన వాక్యాలు చూస్తుంటే మహిళల పట్ల బిజెపి సంకుచిత మనసత్వ ధోరణి బయటపడుతుందని విమర్శించారు. ఢిల్లీ...