Batukammanews
Newspaper Banner
Date of Publish : 08 January 2025, 5:41 pm Posted by : ramakrishna

బిజెపి కార్యాలయాలు ముట్టడిస్తాం

ఆర్మూర్, బతుకమ్మ : కాంగ్రెస్ నేత ఎంపీ ప్రియాంక గాంధీ పై బిజెపి నేత మాజీ ఎంపీ రమేష్ బిదురి అభ్యంతకరమైన వ్యాఖ్య చేయడాన్ని నిజామాబాదు రూరల్ యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు సొప్పరి వినోద్ తీవ్రంగా ఖండించారు. ఇటువంటి మహిళా వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన రమేష్ పై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇటువంటి ప్రకటనలు చేస్తున్నందుకు బిజెపి బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని అన్నారు. రమేష్ చేసిన వాక్యాలు చూస్తుంటే మహిళల పట్ల బిజెపి సంకుచిత మనసత్వ ధోరణి బయటపడుతుందని విమర్శించారు. ఢిల్లీ ఎన్నికల సమయాల్లో వాస్తవ సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే బిజెపి ఉద్దేశపూర్వకంగా ఇలాంటి వ్యూహాన్ని అనుసరిస్తున్నట్టు కనిపిస్తుందని విమర్శించారు. బిజెపి నిజమైన స్వభావం వ్యవహార శైలి ఎజెండా వంటి విషయాలను ఈ ఘటన చాలా స్పష్టంగా వెల్లడించిందని పేర్కొన్నారు. రమేష్ చేసిన వాక్యాలు కఠిన చర్యలు తీసుకోవాలని లేనియెడల యువజన కాంగ్రెస్ తరపున ఆందోళనలు ఇస్తామని పేర్కొన్నారు.