Batukammanews
Newspaper Banner
Date of Publish : 03 January 2026, 6:20 pm Posted by : ramakrishna

డ్రగ్స్ తీసుకుంటు పోలీసులకు చిక్కిన బిజెపి ఎమ్మెల్యే కుమారుడు

 

. . .  సుదిర్ రెడ్డిని అరెస్టు చేసిన నార్సింగి పోలీసులు

 హైదరాబాద్, బతుకమ్మ :

డ్రగ్స్ తీసుకున్న ఏపీ బీజేపీ ఎమ్మెల్యే కుమారుడు పోలీసులకు చిక్కాడు.. ఈ సంఘటన శనివారం  సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని నార్సింగిలో జరిగింది. డ్రగ్స్ తీసుకుంటున్నారని విశ్వసనీయ సమాచారం మేరకు నార్సింగిలో పోలీసులు ఆంధ్ర ప్రదేశ్ లోని  జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కుమారుడు సుధీర్ రెడ్డి అదుపులోకి తీసుకున్నారు. సుధీర్ రెడ్డిని చెక్ చేయగా డ్రగ్స్ పాజిటివ్ వచ్చినట్లు నిర్ధారణ అయింది. సుధీర్ రెడ్డిని అరెస్ట్ చేసి డి-అడిక్షన్ సెంటర్‌కు పంపారు పోలిసులు. సుధీర్ రెడ్డి తో పాటు మరొకరు అరెస్టు చేసినట్లు తెలిసింది.