Batukammanews
Newspaper Banner
Date of Publish : 26 October 2024, 6:55 pm Posted by : ramakrishna

లక్ష్యానికి మించి బిజెపి సభ్యత్వ నమోదు చేపట్టాలి

— బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పైడి ఎల్లారెడ్డి

బతుకమ్మ,  నాగిరెడ్డిపేట్ : లక్ష్యానికి మించి భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల వరకు పార్టీని బలోపేతం చేయాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, ప్రముఖ శాస్త్రవేత్త పైడి ఎల్లారెడ్డి అన్నారు. శనివారం భారతీయ జనతా పార్టీ క్రియా శీల సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా మండలంలోని జప్తి జన్కంపల్లి గ్రామంలో బిజెపి సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.బీజేపీ ని గ్రామాల్లో బలోపేతం చేయాలని కోరారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకో బీజేపీ అభ్యర్థులు తమ సత్తా చాటాలని సూచించారు. అనంతరం గ్రామస్తులు, యువకులకు బిజెపి క్రియా శీలా సభ్యత్వాన్ని నమోదు చేయించారు. ఈ కార్యక్రమంలో బిజెపి మండల మాజీ అధ్యక్షుడు మేకల హన్మండ్లు, విశ్రాంతి ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు ఆకుల కిష్టయ్య, బిజెవైఎం ప్రధాన కార్యదర్శి రాజు, గ్రామ అధ్యక్షులు గోపాల్ , నాయకులు విష్ణు, ఈశ్వర్, తదితరులు పాల్గొన్నారు.