Batukammanews
Newspaper Banner
Date of Publish : 20 January 2026, 7:46 pm Posted by : ramakrishna

18 వ డివిజన్ నుంచి బరిలో బీజేపీ మేయర్ అభ్యర్థి

. . . కొలిక్కి వస్తున్న బిజెపి కార్పొరేటర్ అభ్యర్థుల కసరత్తు

 

. . . ముందస్ధుగానే  ఎన్నికల గోదాలో కమలం పార్టీ

 

. . . నోటిఫికేషన్ కి ముందుఎలక్షన్ పనులను ప్రారంభించిన కాషాయదళం 

 

నిజామాబాద్బతుకమ్మ :

 

నిజామాబాద్ నగర పాలకసంస్థపై కాషాయ జెండా ఎగురవేసేందుకు కమలనాధులు ముందస్ధుగాను కసరత్తులుచేస్తున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే అభ్యర్థుల ఖరారు కు ప్రయత్నాలుజోరందుకున్నాయి. ఇందూర్ బల్ధియా ను  ఎన్నికలసంఘం మహిళ జనరల్ కు ఖరారు చేసిన నేపథ్యంలో ముందుగా  మేయర్ అభ్యర్థి ఎవరు , ఏ డివిజన్ నుంచి బరిలోఉండాలి అని తీవ్రంగా కసరత్తు చేస్తున్నారు.  రిజర్వేషన్ లో నగరంలోని 18 వ డివిజన్ మహిళజనరల్ కు కేటాయించిన అక్కడి నుంచి పోటీ చేసే బిజేపి అభ్యర్థి మేయర్ అని ఖరారు కానున్నట్టువిశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఐతే  ఆడివిజన్ నుంచి పోటీ చేసే మహిళ మేయర్ అభ్యర్థి ఎవరు అనేది ఇంకా స్పష్టత రాలేదు.అరవై డివిజన్  లలో సగానికి సగం మహిళలకే కేటాయించగా బిజేపి అభ్యర్థి మాత్రం పలానాడివిజన్ నుంచి పోటీ చేస్తారని జరుగుతున్న ప్రచారం తో అక్కడ ఎవరు పోటీ చేస్తారుఅనే ఉత్కంఠ నెలకొంది. కోత్త వారిని బరిలో దించుతారా , సీనియర్ మహిళా నేతను ఎంపికచేస్తారా అనే ప్రశ్నలు కషాయం పార్టిలో మొదలైంది. బిజేపి ఇప్పటికే కార్పొరేటర్ల ఖరారుతేల్చక ముందు మేయర్ అభ్యర్థి ఎంపిక ప్రక్రియను ప్రారంభించడంతో అ డివిజన్ పైఅందరి దృష్టి పడింది..నిజామాబాద్ మేయర్ పీఠం దక్కించుకునేందుకువిశ్వప్రయత్నాలు చేస్తున్న నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు అరవింద్ ధర్మపురిఅందరినీ కలుపుకొని సమన్వయంతో ఎన్నికల గోదాలో బరిలో దిగారు…. గత బల్దియా  మేయర్ పీఠం త్రుటిలో చేజారగా ఈసారి ఎలాగైనాబల్ధియా పై బిజేపి కన్నేసింది. ఉమ్మడి రాష్ట్రంలో చివరి సారిగా ముక్క దేవేందర్గుప్త బిజేపి నుంచి మున్సిపల్ చైర్మన్ గా పని చేశారు. నగర పాలక సంస్థ ఏర్పడినతర్వాత కమలం పార్టీ మెజార్టీ స్థానాలు గెలుస్తున్న మేయర్ పదవి అందని ద్రాక్ష లా మారింది. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత రెండు సార్లు ఎమ్మెల్యే పదవిని బిజేపిదక్కించుకుంది. ఈ సారి నిజామాబాద్ ఎంపిగా అరవింద్ ధర్మపురి, ఎమ్మెల్యే ధన్ పాల్సూర్యనారాయణ తో పాటు ఆర్మూర్ శాసన సభ్యులు పైడి రాకేష్ రెడ్డి ప్రాతినిధ్యంవహిస్తుండగా పట్టభధ్రుల గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీగా అంజల్ రెడ్డి, ఉపాధ్యాయఎమ్మెల్సీగా మల్కాపురం కోమరయ్య గెలిచిన విషయం తెలిసిందే. వారు ఇదివరకునిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎక్స్ అఫిషియో హోదాను కలిగి ఉన్నారు. గతంలో 28డివిజన్ ను బిజేపి గెలిచి బల్దియాలో అతిపెద్ద పార్టీగా నిలిచినప్పటికీ మేయర్ పీఠంబిఆర్ఎస్ 13 సీట్లు గెలిచిన మిత్రపక్షం మజ్లిస్ అండా తో ఎగరేసుకుపోయింది. 2014లో ఇదే జరిగింది. నాటి సంఘటనలు తిరిగి పునరావృతం కానివ్వకుండా బల్ధియా పై బిజేపి గెలిపించేందుకు సామ దాన బేధ దండోపాయాలను చేస్తున్నారు కమలనాధులు…గత కార్పొరేషన్ ఎన్నికల్లో28 స్థానాలను గెలిచినప్పటికీ కోద్ధి రోజులలోనే కొందరు ఇతర పార్టీలోకి జంప్అయ్యారు.గత పాలకవర్గం పదవీ కాలం ముగిసే వరకు డజన్ మంది కార్పోరేటర్లు కారెక్కారు.అసెంబ్లీ ఎన్నికలకు ముందు కొందరు కార్పొరేటర్లు ఘర్ వాపసీ అంటు తిరిగి వచ్చారు. ఈసారి జరిగే బల్ధియా ఎన్నికల్లో రిజర్వేషన్ లు తాజా మాజీలతో పాటు అశవాహుల ఆశలనుఅడుగంటింప చేసింది. చాలా మంది లీడర్ తమ సతీమణులను, తల్లులను బరిలో దింపేందుకుసన్నహాలు చేస్తుంటే మరి కొందరు డివిజన్ లను మారి వలస వేళ్లేందుకు సిద్ధమౌతున్నారు.బిజేపి లో గెలుపు గుర్రాలు టికెట్ల ఖరారు అని ఇదివరకు ప్రకటించిన నేపథ్యంలోరిజర్వేషన్ ల  ప్రకటించక ముందు ఒకటికిరెండుసార్లు సర్వే జరిపారు కమలనాధులు. మళ్లి రిజర్వేషన్ లు వచ్చిన తరువాత ఈ సారిఅభ్యర్థులను బట్టి సర్వే చేస్తున్నట్లు తెలిసింది. అసలు గోడదూకిన తాజా మాజీల కుటికెట్ లు వస్తాయా రావా అనే సందేహం ఉంది. కోందరు రిజర్వేషన్ లు అనుకూలంగా లేవనివలసకు వేళ్లేందుకు సిద్ధమౌతున్నప్పటికి అసలు టికెట్ ల పంపిణీ ప్రారంభానికి ముందేబిజేపి నుంచి జరుగుతున్న లీక్ ల వ్యవహారం సర్వత్ర కమలం పార్టీ లో పలనా మహిళ లీడర్మేయర్ అభ్యర్థి కావచ్చు అని చర్చ మొదలైంది. ఈ సారి బల్ధియా ఎన్నికల్లో మైనార్టీలుబీజేపీకి ఓటు వేయాలని ఎంపీ ధర్మపురి అర్వింద్ పదే పదే విన్నవిస్తు, ఈ సారి వారికికూడా టికెట్లు కేటాయించి బరిలో నిలుపుతుండటంతో గతంలో కంటే మెజారిటీ స్థానాలుగెలిచి మేయర్ పీఠం మాదేనని పువ్వు పార్టీ నేతలు బల్లగుద్ది చెబుతున్నారు.

 

BJP mayoral candidate in the fray from 18th division
BJP mayoral candidate in the fray from 18th division