ఏర్గట్ల లో బిజెపి మండల కార్యవర్గ సమావేశం

బతుకమ్మ, ఏర్గట్ల: మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ మండల కార్యవర్గ సమావేశాన్ని మంగళవారం రోజున నిర్వహించారు. ఇట్టి కార్యక్రమానికి బిజెపి మండల పార్టీ అధ్యక్షుడు ఏలేటి నారాయణరెడ్డి, అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా బేల్దారి నవీన్, బాల్కొండ నియోజకవర్గ సభ్యత్వ నమోదు కో కన్వీనర్ హాజరు కావడం జరిగింది. ఇట్టి సందర్భంలో ముఖ్య అతిథి నవీన్ మాట్లాడుతూ ముందుగా ఏర్గట్ల మండలంలో బిజెపి పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేయించిన కార్యకర్తలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అలాగే మిగిలిన సభ్యత్వం నమోదు ఏమైనా...