Batukammanews
Newspaper Banner
Date of Publish : 12 November 2024, 7:36 pm Posted by : ramakrishna

ఏర్గట్ల లో బిజెపి మండల కార్యవర్గ సమావేశం

బతుకమ్మ, ఏర్గట్ల: మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ మండల కార్యవర్గ సమావేశాన్ని మంగళవారం రోజున నిర్వహించారు. ఇట్టి కార్యక్రమానికి బిజెపి మండల పార్టీ అధ్యక్షుడు ఏలేటి నారాయణరెడ్డి, అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా బేల్దారి నవీన్, బాల్కొండ నియోజకవర్గ సభ్యత్వ నమోదు కో కన్వీనర్ హాజరు కావడం జరిగింది. ఇట్టి సందర్భంలో ముఖ్య అతిథి నవీన్ మాట్లాడుతూ ముందుగా ఏర్గట్ల మండలంలో బిజెపి పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేయించిన కార్యకర్తలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అలాగే మిగిలిన సభ్యత్వం నమోదు ఏమైనా ఉంటే నవంబర్ 15 తేదీ సాయంత్రం 6 గంటల లోపు పూర్తి చేయాలని, లేదంటే 15 నవంబర్ తేదీన వెబ్సైట్ సాయంత్రం 6 గంటలకు బంద్ అవుతుందని అన్నారు. అలాగే నవంబర్ 26 వరకు బూత్ అధ్యక్షులను ఎన్నుకోవాలని పార్టీ  కార్యవర్గ సమావేశంలో బిజెపి కార్యకర్తలకు ముఖ్య అతిథి నవీన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల బిజెపి పార్టీ ప్రధాన కార్యదర్శి బద్దం సురేష్,దాస రవి,రంజిత్, ఆనందం గంగేష్,గుండ విట్టల్, ప్రసాద్, క్యాతం మహిపాల్, అలాగే పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.