Batukammanews
Newspaper Banner
Date of Publish : 29 August 2025, 3:13 pm Posted by : ramakrishna

బీజేపీ ఆధ్వర్యంలో గణేష్ మండపాలకు లడ్డు పంపిణీ

రుద్రూర్, బతుకమ్మ : బీజేపి పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు యేండల లక్ష్మి నారాయణ గణేష్ మండపాలకు లడ్డును పంపిణీ చేశారు. ఈ లడ్డును రుద్రూర్ మండల కేంద్రంలోని శ్రీ చౌడేశ్వరి గణేష్ మండలితో పాటు అన్ని గణేష్ మండపాలకు స్థానిక మండల బిజెపి నాయకులు అందజేశారు. ఈ కార్యక్రమంలో  బిజెపి పార్టీ జిల్లా కౌన్సిల్ మెంబర్ ప్రశాంత్ గౌడ్, బిజెపి నాయకులు కటికే రామ్ రాజ్, అనీల్, గణేష్ మండలి కమిటీ సభ్యులు పాల్గొన్నారు.