కవిత కామెంట్స్ నేపథ్యంలో సొంత పార్టీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు..
హైదరాబాద్, బతుకమ్మ : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కామెంట్స్ నేపథ్యంలో సొంత పార్టీ బీజేపీపై ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కవిత మాట్లాడిన మాటలు నిజమే అని అనుకుంటున్నానని పేర్కొన్నారు. పెద్ద ప్యాకేజీ వస్తే మా పార్టీ నేతలు కూడా బీఆర్ఎస్ లో కలిసిపోతారని వ్యాఖ్యనించారు. వచ్చే ఎన్నికల్లో అభ్యర్థులు ఎక్కడి నుంచి నిలబడాలి, ఎవరు పోటీ చేయాలి అనేది వాళ్లే డిసైడ్ చేస్తారని తెలిపారు. గతంలో ఇదే జరిగింది, దాని వల్లే బీజేపీ భారీగా నష్టపోయిందన్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాకపోవడానికి ప్రధాన కారణం మా పార్టీ నేతలే అని విమర్శించారు. సస్పెన్షన్ భయంతోనే పార్టీ క్యాడర్, నేతలు నోరు మూసుకుని కూర్చొంటున్నారన్నారు.