వరద బాధితులను పరామర్శించిన బీజేపీ నాయకులు
బతుకమ్మ, బోధన్: బోధన్ మండలం హంగర్గ గ్రామం లో వరద ప్రభావిత ప్రాంతాలను బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డీ మోహన్ రెడ్డి పరిశీలించారు. గత నాలుగు రోజులుగా పోచంపాడ్ బ్యాక్ వాటర్ కారణంగా పంట పొలాలు, ఇళ్లు, గ్రామ వీధులు మునిగిపోయిన పరిస్థితిని పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ హంగర్గతో పాటు బోధన్ నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో పంటలు పూర్తిగా నష్టపోయాయని, సుమారు 20 వేల ఎకరాల్లో 100% పంట నష్టం జరిగిందని తెలిపారు. రైతులను ఆదుకోవడానికి ఎకరానికి రూ.35,000 పరిహారం చెల్లించాలని...