మాజీ ఎమ్మెల్యే రామచంద్రారెడ్డిని కలిసిన బిజెపి నాయకులు 

ఆర్మూర్, బతుకమ్మ :  ఆర్మూర్ పట్టణంలో ఎంపీ ధర్మపురి అరవింద్ నివాసంలో ఖైరతాబాద్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డిని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శి పల్లె గంగారెడ్డి, పట్టణ అధ్యక్షుడు ద్యాగ ఉదయ్, బీజేవైఎం టౌన్ వైస్ ప్రెసిడెంట్ పెద్దోళ్ల భరత్ లు మర్యాదపూర్వకంగా కలిశారు. మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి అదిలాబాద్ వెళ్తుండగా మార్గ మధ్యలో ఎంపీ అరవింద్ నివాసంలో కాసేపు బస చేశారు. ఈ సందర్భంగా ఆయనను భారతీయ జనతా పార్టీ నాయకులు కలిశారు.