సీఎం దిష్టిబొమ్మ దగ్ధం చేసిన బీజేపీ నాయకులు
బాన్సువాడ, బతుకమ్మ : రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు అరెస్టును నిరసిస్తూ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు గురువారం బాన్సువాడ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే ఎండాల లక్ష్మీనారాయణ మాట్లాడుతూ, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఎన్. రామచంద్రరావును అక్రమంగా అరెస్టు చేయడం ప్రజాస్వామ్య విరుద్ధం అని ఆరోపించారు. ప్రతిపక్ష నాయకుల గొంతు నొక్కే ప్రయత్నాలను ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల...