. . . ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠ రెడ్డి
నిజామాబాద్ సిటి, బతుకమ్మ :
తెలంగాణ గల్లీలో ఇష్టానుసారంగా మాట్లాడే బిజెపి ఎంపీలు తెలంగాణ విభజన హామీలను 11 ఏళ్లు అవుతున్న ఎందుకు అమలు చేయడం లేదని మోడీని ఎందుకు ప్రశ్నిస్తాలేరని, తెలంగాణ రాష్ట్రంపై విద్యార్థుల పట్ల బీజేపీ కక్షపూరితంగా వ్యవహరిస్తుందని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠ రెడ్డి అన్నారు. నిజామాబాద్ వేదికగా ఫిబ్రవరి 2,3,4 తేదీల్లో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర నాలుగో మహాసభలు నిర్వహిస్తున్నామని విజయవంతం చేయాలని గురువారం ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యాలయంలో విలేఖరుల సమావేశం లో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి రెండేళ్ల పాలనలో విద్యార్థులకు ఇచ్చిన ఒక్క హామీని కూడా అమలు చేయలేదని, అందాల పోటీలకు ఉన్న నిధులు ,మెస్సీ తో ఫుట్ బాల్ ఆటపై ఉన్న శ్రద్ధ ,వాటికి ఉన్న నిధులు, విద్యార్థుల చదువులకు ఎందుకు లేవని అన్నారు. దేశంలో మోడీ ప్రభుత్వం 11 ఏళ్ల పాలనలో విద్యార్థులను విస్మరించిందని దేశంలో విద్య ప్రవేటీకరణ, కార్పొరేటీకరణ, కాషాయికరణ చేయడానికి కుట్ర చేస్తుందని నూతన జాతీయ విద్యా విధానం పేరుతో విద్యారంగ మొత్తం నిర్వీర్యం చేస్తున్నారని అన్నారు. పాఠ్యాంశాల్లో మతపరపైన అంశాలను చేస్తూ చరిత్రను తొలగించే ప్రయత్నం చేయడాన్నీ విద్యార్థులు తిప్పి కొట్టాలని పిలుపు నిచ్చారు. విభజన హామీల ప్రకారం తెలంగాణకి ఉన్నత విద్యాసంస్థలను కేటాయించడంలో బిజెపి ప్రభుత్వం తెలంగాణ విద్యార్థులపై వివక్ష చూపుతోందని, కిషన్ రెడ్డి, బండి సంజయ్ రాష్ట్ర విద్యార్థులకు విభజన హామీల ప్రకారం రావాల్సిన ఉన్నత విద్యాసంస్థలను రానీయకుండా దూరం చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో విద్యార్థులకు అనేక హామీలు ఇచ్చి రెండేళ్ల పాలన ప్రజా విజయోత్సవ సంబరాలు నిర్వహిస్తూన్నారని, రెండేళ్ల పాలనలో విద్యార్థులకు ఇచ్చిన ఒక హామీ కూడా ఎందుకు అమలు చేయలేదని తెలిపారు. ఈ సమావేశంలో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి రఘురాం , జిల్లా అధ్యక్షుడు సుబోధ్, జిల్లా ఉపాధ్యక్షులు కుశాల్, జిల్లా సహాయ కార్యదర్శి సంజీవ్ తదితరులు పాల్గొన్నారు