. . . కాంగ్రెస్ రాజ్యాంగం ను కాపాడేందుకు పాటు పడుతుంది
. . .కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు నగేష్ రెడ్డి
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :
కాంగ్రెస్ భవన్ లో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ 69 వ వర్ధంతి సందర్భంగా జిల్లా ,నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో శనివారం ఆయనకు ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు, ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ఆ మహనీయునికి నివాళులు అర్పించారు. అనంతరం పులాంగ్ లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన తర్వాత నగర కాంగ్రెస్ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ రాజ్యాంగ పీఠిక ప్రతిజ్ఞ చేయించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు నగేష్ రెడ్డి మాట్లాడుతూ… అంబేద్కర్ దేశంలో అంటరానితనం,కుల వివక్ష నిర్మూలన కొరకు ఎంతో కృషి చేసిన వ్యక్తి అన్నారు. దేశంలో అన్ని మతాలు, తెగలు, దళితులు, గిరిజనులు, వెనుకబడిన కులాల తదితర వర్గాల సమ న్యాయం జరిగేలా, వారి హక్కులకు భంగం వాటిల్లకుండా ఉండేందుకు, సర్వసత్తాక సార్వభౌమాధికారాన్ని దక్కించుకునేందుకు వీలుగా అంబేద్కర్ రాజ్యాంగాన్ని రూపొందించారు అని గుర్తు చేశారు. స్వాతంత్ర్యం వచ్చాక కూడా విద్య, న్యాయం ,సామాజిక అభ్యున్నతి కోసం ఆయన నిరంతరం పోరాడే ప్రజలకు స్వేచ,స్వాతంత్రపు హక్కులు కల్పించారు అని గుర్తు చేశారు. కానీ దానిని బీజేపీ ప్రభుత్వం అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని అవమానిస్తుంది. ప్రజలకు ఆయన ఇచ్చిన హక్కులను కాలారాస్తుంది అని ఆరోపించారు. అంబేద్కర్ ని పేరును కనుమరుగు చేసే విధంగా బీజేపీ ప్రయత్నిస్తుంది. కానీ కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకులు రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని కాపాడుతూ సంవిధాన బచావో కారక్రమాలు నిర్వహిస్తున్నారు అన్నారు. రాజ్యాంగాన్ని,రాజ్యాంగం ప్రజలకు ఇచ్చిన హక్కులను కాపాడటం కాంగ్రెస్ పార్టీ బాధ్యత అన్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి,నూడ చైర్మన్ కేశ వేణు,డిసిసిబి చైర్మన్ రమేష్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి,గ్రంథాలయ చైర్మన్ అంత రెడ్డి రాజా రెడ్డి,సీనియర్ నాయకులు భక్తవత్సలం,సీనియర్ ఉపాధ్యక్షుడు మీసాల సుధాకర్ రావు,రాష్ట్ర ఎన్ఎస్ యుఐ ప్రధాన కార్యదర్శి వేణు రాజ్,సేవాదళ్ అధ్యక్షుడు సంతోష్, ఓబీసీ అధ్యక్షుడు రాజా నరేందర్ గౌడ్,SC సెల్ అధ్యక్షులు లింగం, ఏఐసీసీ అసెంబ్లీ కో ఆర్డినేటర్ కాపుకర్ గన్ రాజ్,నగర మహిళా అధ్యక్షురాలు రేవతి,సీనియర్ మహిళా కాంగ్రెస్ నాయకురాలు పోల ఉష,చంద్రకళ, విజయ రాణి తదితరులు పాల్గొన్నారు