Batukammanews
Newspaper Banner
Date of Publish : 13 August 2026, 4:48 pm Posted by : ramakrishna

ఇందల్వాయిలో ఘనంగా బీజేపీ తిరంగా ర్యాలీ

 

ఇందల్వాయి, బతుకమ్మ :

 

ఇందల్వాయి మండల కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో గురువారం తిరంగా ర్యాలీని ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంతో పాటు వివిధ గ్రామాలకు చెందిన బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. బీజేపీ మండల అధ్యక్షుడు జాలిల శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ర్యాలీలో ద్విచక్ర వాహనాలతో మండల కేంద్రంలోని ప్రధాన వీధుల గుండా ప్రదర్శన చేపట్టారు. “మన దేశ గౌరవం మన తిరంగా జెండా.. మన గర్వం మన భారతదేశం” అంటూ దేశభక్తి నినాదాలు చేస్తూ ర్యాలీ కొనసాగించారు. ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలు జాతీయ జెండాలను చేతబూని ఉత్సాహంగా ర్యాలీలో పాల్గొన్నారు. భారీ సంఖ్యలో కార్యకర్తలు హాజరై తిరంగా ర్యాలీని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు నయిడి రాజన్న, మఠం ల శేఖర్, శ్రావణ్, నాగేష్, తన్నీరు వాసు, లోకాని గోపి, మెండే అశోక్ తదితరులు పాల్గొన్నారు.