Batukammanews
Newspaper Banner
Date of Publish : 05 September 2025, 4:09 pm Posted by : ramakrishna

పన్నులు తగ్గించి పేదల పక్షాన నిలిచిన బీజేపీ ప్రభుత్వం

  • ప్రధాని మోడీ చిత్రపటానికి పాలాభిషేకం

 

వేల్పూర్, బతుకమ్మ : గురువారం జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో పన్నుల భారీ స్థాయిలో తగ్గించి భారతీయ జనతా పార్టీ పేద ప్రజల పక్షనా నిలిచిందని వేల్పూర్ మండల బీజేపీ పార్టీ ప్రెసిడెంట్ బేల్దారి నవీన్ అన్నారు. ఈ మేరకు బాల్కొండ బీజేపీ నియోజకవర్గ ఇన్చార్జి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ ఏలేటి మల్లిఖార్జున్ రెడ్డి ఆదేశానుసారం నరేంద్ర మోడీ ప్రభుత్వం పేద,మధ్య తరగతి ప్రజలకు ఇంత పెద్ద ఎత్తున పన్నులు తగ్గించినందుకు బిజెపి వేల్పూర్ మండల శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేసి నరేంద్ర మోడీ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ నరేంద్ర మోడీ ప్రభుత్వం రహదారులు, మౌలిక వసతులు కల్పించడం, దీర్ఘకాలిక దృష్టితో ఉపాధి కల్పన చేయడం,80 కోట్ల మందికి కరోనా నుంచి ఉచిత రేషన్ ఇవ్వడం ,ఒక్కో రాష్ట్రంలో రైల్వేలు హైవేలు,  వేర్ హౌస్ లు, ఇంటర్నెట్ కనెక్టివిటీ, కాలేజీలు, ఎయిర్పోర్ట్లు,ఆయుధాలు, ఎగుమతులు, ఫోరెక్స్ నిల్వలు, ఇలా ప్రపంచంలోనే అగ్రగామిగా నిలదొక్కుకుంటున్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ప్రజల పక్షాన ఉన్నందున బిజెపి వేల్పూర్ మండల శాఖ మోదీకి కృతజ్ఞతలు తెలపడం జరిగిందన్నారు. నీతి ఆయోగ్ సమావేశంలో మన రాష్ట్రం నుండి పాల్గొన్న భట్టి విక్రమార్క జి ఎస్ టీ స్లాబులు తగ్గించదు అని అన్నప్పటికీ నరేంద్ర మోదీ ప్రభుత్వం పేద మధ్య తరగతీ పక్షంన నిలిచిందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి నోముల నర్సారెడ్డి,బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షుడు నేరెళ్ల శ్రీధర్ గౌడ్, మండల ఉపాధ్యక్షులు జిల్లా ప్రవీణ్,  కోమనపల్లి లింగన్న, మండల కార్యదర్శిలు రాకేష్ , సాగర్, యాల రమేష్ ,బాసెట్టి గంగాధర్, జాగిరపు కృష్ణారెడ్డి, కోమన్ పల్లి రమేష్, ధనుష్,చిట్టిమ రాజు, కార్యకర్తలు పాల్గొన్నారు.