Batukammanews
Newspaper Banner
Date of Publish : 03 August 2025, 8:13 pm Posted by : ramakrishna

ఇంటి ఇంటికీ బీజేపీ..  ప్రతీ గుండెకు మోదీ కార్యక్రమన్ని విజయవంతం చేయాలి

  • బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని ఇందల్వాయి మండలం గన్నారం గ్రామం లో “ప్రతి ఇంటికి బూత్ అధ్యక్షులు” కార్యక్రమం ఉత్సాహంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని అర్బన్ శాసనసభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ, బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇంటి ఇంటికీ బీజేపీ భావనతో సాగుతున్న ఈ కార్యక్రమం, కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల మధ్యకు తీసుకెళ్లే గొప్ప సాధనంగా మారుతోందన్నారు. మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ధి దిశగా వేగంగా ప్రయాణిస్తోంది అని తెలిపారు. బూత్ స్థాయి నాయకుల పాత్ర అత్యంత కీలకమని, గ్రామ స్థాయిలో కేంద్ర పథకాలు ప్రతి ఒక్కరికీ చేరేలా కార్యకర్తలు నిబద్ధతతో పని చేయాలని తెలిపారు. ప్రజలు నమ్మే పార్టీగా బీజేపీ నిలుస్తోంది అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా నేతలు గన్నారం గ్రామంలో ఇంటి ఇంటికీ తిరిగి, కేంద్ర పథకాలు, మోదీ పాలన విశేషాలు వివరించారు. కరపత్రాలు అందజేశారు. ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. ఆవాస్ యోజన, ఉజ్జ్వల, ఆయుష్మాన్ భారత్, పీఎం కిసాన్, జనధన్, హర ఘర్ జల్, బేటీ బచావో తదితర పథకాలు వివరించడం జరిగింది ఈ కార్యక్రమం లో బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

BJP from door to door.. Modi's program should be successful in every heart.