రుద్రూర్, బతుకమ్మ : రుద్రూర్ మండల కేంద్రంలోని చౌరస్తా ప్రాంగణంలో ఆదివారం 45 వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. అనంతరం బీజేపీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్బంగా రుద్రూర్ మండల అధ్యక్షులు ఆలపాటి హరికృష్ణ మాట్లాడుతూ.. 45 వ భారతీయ జనత పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను అన్ని గ్రామాలలో ఘనంగా నిర్వహించుకున్నామన్నారు. ఎన్నికల్లో బిజెపి పార్టీ అధికారంలోకి వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కౌన్సిల్ మెంబర్ ప్రశాంత్ గౌడ్, మండల ప్రధాన కార్యదర్శిలు ఏముల గజేందర్, వడ్లసాయినాథ్, మండల యువ మోర్చా అధ్యక్షులు కుమ్మరి గణేష్, మండల ఎస్సీ మోర్చా అధ్యక్షులు శివప్రసాద్, మండల సీనియర్ నాయకులు జీలకర్ర విజయ్, కటికే రామ్ రాజ్, చీదుర మహిపాల్, వినోద్ కుమార్, శ్రీకాంత్, నర్వాడి వినోద్ కుమార్, బోజిగొండ అనిల్,గంగాధర్, రవి, బిజెపి సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.