కార్పొరేషన్ కమిషనర్ ను కలిసిన బీజేపీ ఫ్లోర్ లీడర్

నిజామాబాద్, బతుకమ్మ: నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన దిలీప్ కుమార్ ను భారతీయ జనతాపార్టీ ఫ్లో ర్ లీడర్ గోపిడి స్రవంతి రెడ్డి పార్టీ కార్పొరేటర్లతో కలిసి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కమిషనర్ కు వారు శుభాకాంక్షలు తెలిపారు. తమ డివిజన్ ల పరిధిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను కమిషనర్ కు వివరించారు. ప్రతి డివిజన్ కు రూ.25లక్షల చొప్పున నిధులు కేటాయించాలని, తాత్కాలికంగా 25చొప్పున వీధి దీపాలు అందజేయాలని, కౌన్సిల్ సమావేశాన్ని త్వరగా నిర్వహించాలని కోరారు. స్రవంతి...