Batukammanews
Newspaper Banner
Date of Publish : 10 November 2024, 1:39 pm Posted by : ramakrishna

కార్పొరేషన్ కమిషనర్ ను కలిసిన బీజేపీ ఫ్లోర్ లీడర్

నిజామాబాద్, బతుకమ్మ: నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన దిలీప్ కుమార్ ను భారతీయ జనతాపార్టీ ఫ్లో ర్ లీడర్ గోపిడి స్రవంతి రెడ్డి పార్టీ కార్పొరేటర్లతో కలిసి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కమిషనర్ కు వారు శుభాకాంక్షలు తెలిపారు. తమ డివిజన్ ల పరిధిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను కమిషనర్ కు వివరించారు. ప్రతి డివిజన్ కు రూ.25లక్షల చొప్పున నిధులు కేటాయించాలని, తాత్కాలికంగా 25చొప్పున వీధి దీపాలు అందజేయాలని, కౌన్సిల్ సమావేశాన్ని త్వరగా నిర్వహించాలని కోరారు. స్రవంతి రెడ్డి వెంట  డిప్యూటీ ఫ్లోర్ లీడర్ న్యాలం రాజు, కార్పొరేటర్ పంచ రెడ్డి ప్రవళిక, భాజపా నాయకులు ఇప్పకాయల కిషోర్, పంచ రెడ్డి శ్రీధర్ తదితరులు ఉన్నారు.