Batukammanews
Newspaper Banner
Date of Publish : 11 February 2026, 7:59 pm Posted by : ramakrishna

ఇందూరు మున్సిపల్ కార్పొరేషన్ పై భాజపా జెండా ఎగరబోతుంది

 

. . . ఓటు హక్కు వినియోగించుకున్న అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ దంపతులు

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : 

 

ఇందూరు మున్సిపల్ కార్పొరేషన్ పై భాజపా జెండా ఎగరబోతుందని అర్బన్ శాసనసభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ పేర్కొన్నారు. బుధవారం జరిగిన మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో ఎమ్మెల్యే దంపతులు నగరంలోని హరిచరణ్ మార్వాడి పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ లో ఓటు వేసి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం ఆయన నగరంలోని పలు పోలింగ్ కేంద్రాలలోకి వెళ్లి పోలింగ్ సరళిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మన ఇందూరు-మన మేయర్ నినాదంతో ఈ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ముందుకెళ్లిన భారతీయ జనతా పార్టీ కి నగరంలోని అన్ని డివిజన్ లోని ప్రజలు భాజపాకు మద్దతు తెలిపారని ఆయన అన్నారు. మెజారిటీ స్థాయిలో అన్ని డివిజన్ లలో ప్రజలు కమలం పువ్వు కు ఓటు వేసి పార్టీ తరఫున నిలిచారని ఆయనన్నారు. అదేవిధంగా బిజెపి పార్టీకి ఓటు వేసిన ప్రతి ఒక్కరికి ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు.