సీపీని కలిసిన బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి శుక్రవారం నిజామాబాదు పోలీస్ కమిషనర్ సాయి చైతన్యని మర్యాద పూర్వకంగా కలిశారు. జిల్లాలో శాంతి భద్రతల పరిస్థితి, గంజాయి అక్రమ రవాణా, బీజేపీ కార్యకర్తలపై దాడులు, అలాగే క్రికెట్ బెట్టింగులు, బెట్టింగ్ యాప్‌ల దుర్వినియోగంపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇటీవల జిల్లాలో కొన్ని అనేక అవాంఛిత ఘటనలు చోటుచేసుకున్నాయన్నారు. ప్రజల్లో భద్రతా విశ్వాసం పెంచేందుకు పోలీసులు మరింత కృషి చేయాలని కోరారు. గంజాయి, మత్తు పదార్థాల అక్రమ రవాణా &...