. . . జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి
నిజామాబాద్ సిటి, బతుకమ్మ :
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 14 నెలల కాలంలో చేసిన డెవలప్ మెంట్ ను పట్టబద్రులు ఆలోచించి కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయండని ధైర్యంగా చెప్పిన వ్యక్తి రేవంత్ రెడ్డి అని, ఆయన మాటలకు ఖంగుతిన్న ఎమ్మెల్యేలు ధన్ పాల్, రాకేష్ రెడ్డి ఏం మాట్లాడాలో అర్థంకాని స్థితిలో రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను వక్రీకరించి అబద్ధపు మాటలు మాట్లాడుతున్నారని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి అన్నారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ , రైతులకు రుణమాఫీ , రైతు బోనస్ , రేషన్ కార్డుల పంపిణీ ,ఇందిరమ్మ ఇండ్లు, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ,గృహ జ్యోతి వంటి పథకలు అమలు చేశామని,యువకులకు స్కిల్ యూనివర్సిటీ తీసుకు వచ్చామని వివరిస్తూనే ఇవన్నీ చేస్తేనే కానీ ఒక్కసారి వాళ్లు ఆలోచించాలని రేవంత్ రెడ్డి ధైర్యంగా చేసిన పనులు చెప్పి ఓట్లు అడుగుతున్నారని గుర్తు చేశారు. కానీ బిజెపి నాయకుల లాగా పది సంవత్సరాలుగా ప్రజలకు ఒక పథకాన్ని కూడా అందించకుండా కేవలం మోడీ ముఖాన్ని చూసి ఓట్లు వేయమని అడగడం బిజెపి సిగ్గు మాలినతనానికి నిదర్శనమని ఆయన అన్నారు. ప్రభుత్వానికి పట్టభద్రులకు సమన్వయం చేసే విధంగా ఉండాలి అంటే నరేందర్ రెడ్డి ఎమ్మెల్సీగా గెలవాలని నరేందర్ రెడ్డి ఒకవేళ గెలవలేక పోతే అది ప్రభుత్వానికి పట్టభద్రులకు సమన్వయం లోపించే విధంగా ఉంటుందని రేవంత్ రెడ్డి మాట్లాడితే దానిని అర్థం చేసుకొని బిజెపి నాయకులు అబద్ధాలు మాట్లాడుతున్నారని మానాల మోహన్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు రామ్మూర్తి గోపి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు అబుద్ బిన్ హందాన్, నగర ఎస్సీ సెల్ అధ్యక్షులు వినయ్, బింగి మధుసూదన్, సాయికిరణ్, శివ, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.