భీమ్ గల్, బతుకమ్మ : భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ కూటమి బీహార్ లో విజయందుందుభి మ్రోగించిన సందర్బంగా భీమ్ గల్ మండల బీజేపీ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం విజయోత్సవ సంబురాలను నిర్వహించారు. ఈ సందర్బంగా టపాసులను పేల్చి, స్వీట్లు ఒకరినొకరు తినిపించుకొన్నారు. అనంతరం బీజేపీ మండల్ ప్రెసిడెంట్ అరె రవీందర్ మాట్లాడుతూ బీహార్ లో ఎన్డీఏ కూటమి విజయ దుందుభి మోగించడంతో ఈ సంబరాలు నిర్వహించామని, ఎన్ డి ఏ కూటమికి శుభాకాంక్షలు తెలుపుతూ ప్రతిపక్ష పార్టీలు ఎన్ని కుట్రలు పన్నీన, ఎన్నికల సమయంలో ఉగ్ర దాడులు జరిపి బిజెపి మీద నెపం వేద్దామనుకున్న ఉగ్ర మూకల ఆటలు చెల్లకుండా బీహార్ ప్రజలు బిజెపి వైపు నిలబడ్డందుకు బిజెపి తరుపున బీహార్ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.రానున్న రోజులలో తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ కాషాయ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ నెంబర్ యోగేశ్వర నరసయ్య, మండల ప్రధాన కార్యదర్శి రామకృష్ణ,ఓ బి సి మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు లక్ష్మణ్ గౌడ్, మండల ఉపాధ్యక్షులు లక్ష్మీనారాయణ,యువమోర్చా అధ్యక్షులు శెట్టి ప్రేమ్చంద్, సీనియర్ నాయకులు భీంగల్ సర్వసమాజ్ కోశాధికారి కాపు కుమారి హరీష్, కొట్టాల అశోక్,తక్కురి అంజయ్య, పతాని ప్రవీణ్, ప్రమోద్, బీరువాల లక్ష్మీనారాయణ,తక్కురి సాయి రెడ్డి,కుండల అన్వేష్,సంగ్ సాయి, బొదురే మోహన్,ఆరోల్ల నరసింహ, డాక్టర్ పుండరీకం భూత్ అధ్యక్షులు మండల, పదాధికారులు పాల్గొన్నారు.
