ఇంటింటికి జోరుగా బీజేపీ ప్రచారం

రుద్రూర్, బతుకమ్మ : స్థానిక ఎన్నికల్లో భాగంగా రుద్రూర్ మండల కేంద్రంలో ఆదివారం బీజేపీ నాయకులు ఇంటింటికి తిరుగుతూ జోరుగా ప్రచారం నిర్వహించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రవేశ పెట్టిన పథకాలను ప్రజలకు వివరిస్తూ బిజెపి పార్టీకి మద్దత్తు తెలుపాలని కరపత్రాలను అందజేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మహిళలకు, యువకులకు, రైతులకు అనేక రకాల పథకాలు ప్రవేశపెట్టి అందజేశారన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి పార్టీ మండల అధ్యక్షులు ఆలపాటి హరికృష్ణ, దొరబాబు, జిల్లా కౌన్సిల్ మెంబర్ ప్రశాంత్ గౌడ్,...