బీజేపీ, బీఆర్ఎస్ కలిసి బీసీ రిజర్వేషన్లను అడ్డుకునే కుట్ర
నిజామామాద్, బతుకమ్మ : బీజేపీ, బీఆర్ఎస్ కలిసి బీసీ రిజర్వేషన్లను అడ్డుకునే కుట్ర చేస్తున్నాయని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ విమర్శించారు. శనివారం నగరంలోని ఆర్అండ్ బీ అతిథి గృహంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లను కట్టుబడి ఉన్నామని అమలు చేస్తామన్నారు. హైకోర్టు స్టే ఇచ్చిన నేపథ్యంలో సుప్రీంకోర్టుకు వెళ్లి అప్పీల్ చేసే యోచనలో ఉన్నామన్నారు. బీసీ రిజర్వేషన్లను అడ్డుకోవడంలో ప్రధాన ముద్దాయి బీజేపీయే అని ఆరోపించారు. బనకచర్ల, బీసీ రిజర్వేషన్లపై బీజేపీ...