Batukammanews
Newspaper Banner
Date of Publish : 22 December 2024, 8:09 pm Posted by : ramakrishna

పీవీ, కాకా వెంకటస్వామిల వర్దంతి వేడుకలు

ఆర్మూర్, బతుకమ్మ : ఆర్మూర్ లో మాల మహానాడు వ్యవస్థాపకులు పీవీ రావు,తొలి,మలి దశ తెలంగాణ పోరాట యోధుడు, కార్మిక వర్గ క్రాంతిరేఖ,గుడులేని ప్రజల జీవితాల్లో గుడిసై వెలుగులు నింపిన కేంద్ర మాజీ మంత్రి గడ్డం వెంకటస్వామి(కాకా)ల వర్దంతి సందర్భంగా ఆదివారం అంబేద్కర్ చౌరస్తాలో మాల సంఘాల జేఏసీ ఆర్మూర్ డివిజన్ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించారు.  మాల సంఘాల జేఏసీ కో-చైర్మన్ అంగరి ప్రదీప్ మాట్లాడుతూ మాల సామాజిక వర్గ అస్తిత్వం, ఆత్మగౌరవం, ఐక్యత,అభివృద్ధి కొరకు తమ జీవితాలను దారబోసిన పీవీ రావు,కాకా వెంకటస్వామిల జీవితాలను మాల యువత ఆదర్శంగా తీసుకుని మాల జాతి అభివృద్ధికి పాటుపడాలనిపిలుపునిచ్చారు. పీవీరావు దళితుల ఐక్యతకు విఘాతం కలిగిస్తు దళితులను ఉప వర్గీకరించే మనువాదా పాలకుల కుట్రలకు వ్యతిరేకంగా పోరాడి దళితుల హక్కులు, ఆత్మగౌరవం కోసం తన జీవితాన్ని తృణప్రాయంగా వదిలిన నిరడంబరా,నిఖార్సయిన త్యాగశీలి పీవీరావు.కాకా వెంకటస్వామి అంటరాని గుడిసె నుండి అఖిల భారత స్థాయి లో పదవులకు వన్నెతెచ్చిన గొప్ప నాయకుడని,తొలి,మలి దశ తెలంగాణ పోరాటంలో పాల్గొని తెలంగాణ ఆకాంక్షను జాతీయ స్థాయిలో వినిపించి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కాంగ్రెస్ పెద్దలను ఒప్పించి 4 కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షను సాకారం చేసిన గొప్ప నాయకుడు కాకా వెంకటస్వామి అన్నారు.కాకా కార్మిక మంత్రిగా అనేక విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుని అసంఘటిత రంగంలోని కార్మిక లోకానికి పెన్షన్ ఇప్పించిన గనుడన్నారు తన జీవితంలో అనేక గొప్ప నిర్ణయాలు తీసుకొని పేద ప్రజాలపలిట గొప్ప వ్యక్తిగా నిలిచారన్నారు ఈ కార్యక్రమంలో ఆర్మూర్ మాల సంఘాల జేఏసీ సభ్యులు పింజ పెద్ద బోజన్న, షెట్పల్లి నారాయణ, పులి సాయిరాం,నగసేన్ మాల,అగ్గు క్రాంతి, పింజ భూమేశ్వర్,టీం నాయకులు ఆంద్రయ్య,అబ్బా రవి,వినయ్ కుమార్,మామిడి రవీందర్,రత్నం,అంబులెన్స్ రాజు,వికాస్,తదితరులు పాల్గొన్నారు.

Birthday celebrations of PV and Kaka Venkataswamy