ఘనంగా ఎంపీ సురేష్ కుమార్ షేట్కార్ జన్మదిన వేడుకలు
రుద్రూర్, ఆగస్టు 8 (బతుకుమ్మ) : జహిరాబాద్ పార్లమెంట్ సభ్యులు ఎంపీ సురేష్ కుమార్ షట్కార్ జన్మదిన వేడుకలను రుద్రూర్ మండల కేంద్రంలోని బస్టాండ్ ప్రాంగణంలో గురువారం ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి ఒకరినొకరు తినిపించుకుంటూ జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్బంగా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇందూరు చంద్రశేఖర్ మాట్లాడుతూ... మృదుస్వబావి స్నేహశీలి సురేష్ కుమార్ షట్కార్ ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని, ఆయురారోగ్యాలతో ఉండాలని మనసారా కోరుకుంటూ వారికి రుద్రూర్ మండల తరపున హార్దిక జన్మదిన శుభాకాంక్షలు...