మద్నూర్,బతుకమ్మ: తెలంగాణ రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జన్మదిన వేడుకలను సోమవారం జుక్కల్ నియోజకవర్గంలోని మహమ్మద్ నగర్ మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయం వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జుక్కల్ మాజీ శాసనసభ్యులు హనుమంత్ షిండే, ఉమ్మడి జిల్లాల మాజీ జడ్పీ చైర్మన్, తెలంగాణ బి ఆర్ ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు దపెదర్ రాజ,మండల అధ్యక్షులు సాదుల సత్యనారాయణ, మండల సీనియర్ నాయకులు గంగారెడ్డి, అన్ని గ్రామాల మాజీ ఎంపిటిసిలు, సర్పంచులు, సొసైటీ చైర్మన్లు ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు.
