Batukammanews
Newspaper Banner
Date of Publish : 08 September 2025, 5:11 pm Posted by : ramakrishna

బీజేపీ సోషల్ మీడియా కన్వీనర్ కూరెళ్ళ శ్రీధర్ జన్మదిన వేడుకలు

బతుకమ్మ, బోధన్: భారతీయ జనతా పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ కూరెళ్ళ శ్రీధర్ పుట్టినరోజు సందర్భంగా, బీజేపీ నాయకులు నమిళ్ల సాయి దాతృత్వంతో, బోధన్ మండల అధ్యక్షుడు సిర్ప సుదర్శన్  ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. బోధన్ మండలం అమ్ధాపూర్ గ్రామంలోని జిల్లా ప్రాథమిక ఉన్నత పాఠశాలలో, పదవ తరగతి విద్యార్థులకు పరీక్షల అట్టలు, పెన్నులు పంపిణీ చేయడంతో పాటు కేక్ కటింగ్ కార్యక్రమం కూడా నిర్వహించారు. అదే విధంగా, ఇటీవల భారీ వర్షాల కారణంగా గోడల రంగులు ఊడిపోయిన హంగర్గా గ్రామ ప్రాథమిక పాఠశాలకు కొత్తగా పెయింటింగ్ కలర్స్ అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమాల్లో మండల ప్రధాన కార్యదర్శులు జంగం వెంకటేష్, దొనకంటి లక్ష్మా రెడ్డి, బీజేపీ మాజీ మండల అధ్యక్షుడు రాజురె మనోహర్, మాజీ ప్రధాన కార్యదర్శి జిల్కరి ప్రవీణ్, మండల సీనియర్ నాయకులు, కమిటీ సభ్యులు, బూత్ అధ్యక్షులు, శక్తి కేంద్ర ఇన్చార్జ్‌లు, కార్యకర్తలు, విద్యార్థులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Birthday celebrations of BJP social media convener Kurella Sridhar