హైద్రాబాద్, బతుకమ్మ : మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, ప్రభుత్వ సలహదారులు మహ్మద్ ఆలీ షబ్బిర్ పుట్టిన రోజు వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. షబ్బిర్ఆలీ 69 వ పుట్టిన రోజు వేడుకలను హైద్రాబాద్ లోని ఆయన నివాసంలో నిజామాబాద్ కు చెందిన సినియర్ నాయకులు, పోల్యూషన్ కంట్రోల్ బోర్డ్ మెంబర్ హరోన్ ఖాన్ అధ్వర్యంలో నిర్వహించారు. ఈ సంధర్బంగా షబ్బిర్ ఆలీకి ఆయన పుష్ఫగుచ్చాలు అందచేసి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సంధర్బంగా కేక్ కట్ చేసి అందరికి తినిపించారు. ఈ కార్యక్రమంలో సినియర్ కాంగ్రెస్ యూత్ నాయకులు ఇమ్రాన్ ఖాన్ తదితరులు ఉన్నారు.
