బర్త్ డే వేడుకలు సరే.. రోగుల బాధలు ఎవరికి చెప్పుకోవాలి..?

. జీజీహెచ్ చుట్టూ వివాదాలు . అయినా మారని పరిస్థితి నిజామాబాద్, బతుకమ్మ: జిల్లా కేంద్ర ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి (జీజీహెచ్)ని వివాదాలు చుట్టుముడుతూనే ఉన్నాయి. ఇటీవల జిల్లా పర్యటనకు వచ్చిన  వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ.. సూపరింటెండెంట్ ప్రతిమారాజ్ వ్యవహారశైలిని తప్పుపడుతూ ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. దీనికి తోడు ఆమె ఫిర్యాదులు, ఆరోపణలు అనేకం ఉండడంతో తీరు మార్చుకోవాలని సూచించినట్లు సమాచారం. ఇంత జరిగినా పరిస్థితిలో మార్పు రావడం లేదని పలువురు విమర్శిస్తున్నారు. రెంజల్ మండలం కల్యాపూర్ గ్రామానికి చెందిన...