Batukammanews
Newspaper Banner
Date of Publish : 21 May 2026, 8:39 pm Posted by : ramakrishna

టీఆర్ఎస్ లో చేరిన బినోల సొసైటీ చైర్మన్ మగ్గరి హన్మండ్లు

 

హైదరాబాద్, బతుకమ్మ :

 

కల్వకుంట్ల కవిత సమక్షంలో బినోల సొసైటీ చైర్మన్ మగ్గరి హన్మండ్లు గురువారం పార్టీ కండువా కప్పుకుని అధికారికంగా పార్టీలో చేరారు. ఈ సందర్భంగా నిజామాబాద్ జిల్లా నుండి వచ్చిన పార్టీ శ్రేణులతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సమావేశంలో పార్టీ బలోపేతం, గ్రామస్థాయి కార్యకలాపాల విస్తరణ, ప్రజల సమస్యలపై పోరాటం వంటి అంశాలపై చర్చించారు.

 

Binola Society Chairman Maggari Hanmandlu joins TRS

 

అనంతరం మాట్లాడిన నాయకులు, నిజామాబాద్ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో పార్టీ గద్దెలను ఏర్పాటు చేసి జెండా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు, ప్రతి గ్రామంలో పార్టీని మరింత బలోపేతం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమం ద్వారా జిల్లాలో పార్టీకి కొత్త ఉత్సాహం వచ్చిందని నాయకులు అభిప్రాయం వ్యక్తం చేశారు.

 

Binola Society Chairman Maggari Hanmandlu joins TRS