డిల్లీ, బతుకమ్మ : ప్రస్తుతం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్యల్లో డీప్ ఫేక్ ఒకటి . ఈ డీప్ ఫేక్ నియంత్రణకు సంబంధించిన బిల్లును లోక్ సభలో శివసేన ఎంపీ శ్రీకాంత్ సిందే శనివారం ప్రవేశపెట్టారు. ఇలాంటి కంటెంట్ కట్టడికి అవసరమైన లీగల్ ఫ్రేమ్ వర్క్ ను రూపొందించేలా ప్రైవేట్ మెంబర్ బిల్లును ప్రతిపాదించారు. ఇలాంటి కంటెంట్లు రూపొందించేందుకు వ్యక్తుల నుంచి ముందస్తు అనుమతి తప్పనిసరి చేయాలన్నారు. వేధింపులు, మోసం, తప్పుడు సమాచారం కోసం డీప్ ఫేక్ ను దుర్వినియోగం చేయడం పెరిగిపోయిందని, దీని నియంత్రణకు వెంటనే చర్యలు చేపట్టాలని సిందే అన్నారు.