పంచాయతీ కార్యదర్శి వేధింపులతో బిల్ కలెక్టర్ ఆత్మహత్య ?
బోధన్, బతుకమ్మ : కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం పోచారం గ్రామానికి చెందిన నీరుడి బాబు (38), బోధన్ మండలం పెంటకుర్ద్ గ్రామంలో బిల్ కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తూ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపింది. ఈ నెల 5వ తేదీ ఉదయం బాబు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే బోధన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం పరిస్థితి విషమించడంతో ప్రైవేట్...