Batukammanews
Newspaper Banner
Date of Publish : 08 December 2024, 5:40 pm Posted by : ramakrishna

జల్సాలకు అలవాటు పడి బైక్ లు దొంగతనాలు

  • యువకుడిని కోర్టులో హాజరు పరిచిన పోలీసులు

 నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : జల్సాలకు అలవాటు పడి నిజామాబాద్ నగరంలో పార్కింగ్ చేసిన బైక్ లు దొంగతనం చేస్తున్న పాత నేరస్తుడు నవిపేట మండలం బినోల గ్రామానికి చెందిన  యువకుడిని పట్టుకొని కోర్టులో హాజరు పరిచినట్లు వన్ టౌన్ ఎస్ హెచ్ ఓ రఘుపతి తెలిపారు. యువకుడిని విచారించగ తన నేరం ఒప్పుకొని, తాను దొంగతనం చేసిన వాహనాలు లను పోలీస్ లకు చూపించగా  వాహనాలను నేరస్తుని  దగ్గర నుండి స్వాధీనం చేసుకొని, నేరస్తున్ని అరెస్ట్ చేసి కోర్టు లో హాజరు పరిచారు. నేరస్తున్ని పట్టుకొని వాహనాలను సీజ్ చేయటం లో చక్కచక్యంగా వ్యవహరించిన ఏ ఎస్ ఐ . షకీల్, పి సీ గంగారాం, రవి లను ఉన్నతధికారులు అభిందించారు.